ఆగస్టు 9న ‘శ్రీనివాస కళ్యాణం’

నితిన్‌, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస్ కళ్యాణం’ ఈ చిత్రాన్ని శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. గోదావరి జిల్లాలతో పాటు ఛండీఘర్‌లో చిత్రకరణ పూర్తి చేశారు.

ఇప్పటికే పొస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు కూడా ప్రారంభమైన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదిన రిలీజ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. తాజాగా చిత్రయూనిట్ రిలీజ్‌ డేట్‌తో పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. లై, ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో నితిన్‌ కెరీర్‌కు శ్రీనివాస కళ్యాణం సక్సెస్‌ కీలకంగా మారింది. నందితా శ్వేత మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకురుస్తున్నారు.