HomeTelugu News'సమ్మోహనం' ట్రైలర్‌ విడుదల చేయనున్న 'సూపర్‌ స్టార్‌ కృష్ణ'

‘సమ్మోహనం’ ట్రైలర్‌ విడుదల చేయనున్న ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’

సుధీర్‌బాబు హీరోగా రాబోతున్న చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి అదితి రావ్‌ హైదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సుధీర్‌బాబు మామగారు, సినీనటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని సుధీర్‌ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మీరెంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘సమ్మోహనం’ ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ మే 31న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. మెస్మరైజ్‌ అవ్వడానికి సిద్దంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు. జూన్‌ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

10

ఓ పక్క కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న సుధీర్‌బాబు ఇప్పుడు నిర్మాతగా మారారు. ఇటీవలే ‘ఎస్‌బీ’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు సంబంధించిన లోగోను ఇటీవలే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో నటించా. ఈ ప్రయాణంలో చాలా మంది ప్రతిభ ఉన్న దర్శకులు కథలు చెప్పారు. ఇలాంటి కథల్ని మనమే ఎందుకు తీయకూడదు అనిపించి నిర్మాతగా మారాను. నేనే హీరోగా కాకుండా ఇతరులతో కూడా సినిమాలు చేస్తాను. ప్రస్తుతం నేను హీరోగా ఈ సంస్థలో తొలి సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu