సమంత ఎదురుచూసిన రోజు వచ్చేసింది!

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలోఉంది. అటు కెరీర్ పరంగా ఇటు వ్యక్తిగతంగా కూడా సామ్ చాలా సంతోశంగా ఉంది. ఆ సంతోషాన్ని రెట్టింపు చేసే రోజు రానే వచ్చింది. చాలా కాలంగా సమంత ఎదురుచూస్తోన్న సమయమిది. ఈ ఏడాది ఆగస్ట్ లో సమంత తను ప్రేమించిన చైతుని పెళ్లాడబోతుంది.

ముందుగా ఈ జంట ఈరోజు నిశ్చితార్ధం జరుపుకొనున్నారు. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈరోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న సమంత ఆనందానికి అవదుల్లేవట. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. హుషారుగా డాన్స్ చేస్తూ కనిపిస్తోన్న సామ్ ను చూస్తుంటే తను ఎంత ఆనందంగా ఉందో.. తెలిసిపోతుంది. ఈరోజు ఎంగేజ్మెంట్ జరుపుకుంటోన్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుదాం!