
Prabhas Spirit Movie Heroine:
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ స్పిరిట్‌కి హీరోయిన్‌గా దీపికా పదుకొణె ఫిక్స్ అయిందని సమాచారం. తల్లిగా మారిన తర్వాత సినిమా కెరీర్‌కి బ్రేక్ తీసుకున్న దీపికా, ఇప్పుడు పునరాగమనం చేసేందుకు సిద్ధంగా ఉంది.
మొదట్లో దీపికా స్పిరిట్‌కి నో చెప్పిందట. ఎందుకంటే షూటింగ్ డేట్ 2024 చివరలో ఉండగా, అప్పట్లో ఆమె గర్భవతిగా ఉండేది. కానీ ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో గాయపడటంతో స్పిరిట్ షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు అక్టోబర్ 2025లో సినిమా సెట్స్‌పైకి వెళ్తోంది. దీంతో మళ్లీ ఆఫర్ ఇచ్చినప్పుడు దీపికా వెంటనే ఓకే చెప్పేసిందట!
ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందంట. సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు రాసిన ఫిమేల్ క్యారెక్టర్స్‌లో ఇదే బలమైనదట. కథ విన్న వెంటనే దీపికా ఇంప్రెస్ అయ్యిందట. ‘కల్కి 2898 AD’లో కంటే ఎక్కువగా ప్రభాస్-దీపికా స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం.
భూషణ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపికా ఈ మూవీకోసం రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో ‘కింగ్’ సైన్ చేసింది. అలాగే ‘కల్కి 2’, ‘పఠాన్ 2’ కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఇక స్పిరిట్ సినిమా 2025 అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. రీల్‌లోనూ రీయల్‌లోనూ మాములుగా కాకుండా మళ్లీ పునరాగమనానికి దీపికా సిద్ధమవుతోంది. ఈ సినిమా 2027 ప్రారంభంలో రిలీజ్ కావచ్చని అంచనా.
ALSO READ: Shahrukh Khan Allu Arjun కాంబోలో సినిమా గురించి Vijay Deverakonda ఏమన్నారంటే












