
Aamir Khan’s son:
ముంబైలో ఇటీవల జరిగిన సితారే జమీన్ పర్ ప్రీమియర్ ఈవెంట్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. స్టార్ హీరోల మధ్య స్నేహం ఎంతో ఉంది, కానీ ఓ చిన్న అవగాహన లోపం వల్ల అది హైలైట్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే…
సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్‌కి భారీ సెక్యూరిటీతో హాజరయ్యారు. గతంలో వచ్చిన బెదిరింపుల వల్లే ఈ కఠినమైన సెక్యూరిటీ. ఆయన వేదికకు వెళ్లే సమయంలో, ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ కూడా ఆయన వెంట రావాలనుకున్నాడు. కానీ సల్మాన్ బాడీగార్డ్స్ అతన్ని గుర్తించలేకపోయారు. ‘ఇతను ఎవరో?’ అనుకుంటూ, బయటకు నెట్టేశారు.
జునైద్ తనను వివరంగా చెప్పాలనుకున్నాడు, “నేను ఆమిర్ ఖాన్ కొడుకును” అని చెప్పినా, గార్డ్స్ వినలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఏమయ్యిందంటే, జునైద్ అసహనం చూపకుండా, స్నేహంగా నవ్వుతూ, ఓ బాడీగార్డ్ చేయి తాకుతూ గౌరవంగా వ్యవహరించాడు. ఇదంతా కెమెరాల్లో నమోదై సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెట్టారు – “స్టార్ కిడ్స్ కూడా ఇలాంటి పరిస్థుల్లో పడతారేమో?” అని. మరికొందరు “ఇదే హ్యూమిలిటి అంటే!” అని మెచ్చుకున్నారు.
ఈ ఈవెంట్‌కు షారుక్ ఖాన్, రేఖా, విక్కీ కౌశల్, శబానా ఆజ్మీ, జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఆమిర్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో పాటు, పిల్లలు ఆజాద్, ఇరా, జునైద్‌తో వచ్చారు.
ALSO READ: ఈ Hyderabad Restaurants మన ఇండియన్ క్రికెటర్ లకి చెందినవి అని మీకు తెలుసా?













