హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ ఫామ్‌హౌస్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ నగర శివార్లలో 6.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఫామ్‌హౌస్‌ను డెవలప్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తనకు నచ్చిన విధంగా ఫామ్‌హౌస్‌ను తీర్చిదిద్దనున్నారట. ఇందులో ఆర్గానిక్ పంటలు పండించాలని అనుకుంటున్నారట. ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా ఈ స్థలాన్ని కొనుగోలు చేశారట. ఇందులో ఓ ఇల్లుతో పాటు రకరకాల పూల మొక్కలు, తోటలను అభివృద్ధి చేయనున్నారట. అయితే ఈ స్థలానికి ఎంత వరకు వెచ్చించారో తెలియాల్సి ఉంది. పవన్ కల్యాణ్ ఫామ్‌ హౌస్‌కు దగ్గర్లోనే ఎన్టీఆర్ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ సంపాదనను పలు బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేస్తుండగా మరికొందరు ఫామ్‌హౌస్‌లపై దృష్టి పెట్టారు. ఈ జాబితాలోకే ఎన్టీఆర్ కూడా చేరారు.

CLICK HERE!! For the aha Latest Updates