HomeTelugu Trendingపశువులకి మనకి తేడా ఉండదు: కొరటాల

పశువులకి మనకి తేడా ఉండదు: కొరటాల

Koratala siva appeals to peటాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ మొదటినుంచి సామజిక అంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ‘రామ్ చరణ్’ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే కొరటాల శివ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. రోజు రోజుకు ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 12 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ సమయంలో కొందరు సినీ ప్రముఖులు స్వచ్చందంగా ముందుకు వచ్చి మాస్క్ ను ధరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ మరోసారి సామజిక బాధ్యతను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. “ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం (ముక్కు మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం” అంటూ కొరటాల ట్వీట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!