
Samantha Valentine’s Day pic:
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. అయితే, ఈ సారి ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆమె మాజీ భర్త నాగ చైతన్య ఇటీవల తన విడాకుల గురించి మాట్లాడారు. ఇద్దరూ లైఫ్‌లో ముందుకు వెళ్లారని స్పష్టం చేశారు. ఇక చైతూ ఇప్పటికే శోభిత ధూళిపాళతో పెళ్లి చేసుకోగా Samantha కూడా తన కొత్త రిలేషన్‌షిప్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత తన బ్రాండ్ “Secret Alchemist” కొత్త ప్రొడక్ట్ లాంచ్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. అయితే అందులో ఒక ఫొటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన 12 ఫొటోలలో 9వ ఫొటోలో సమంత ఒక మిస్టరీ వ్యక్తితో కలిసి టోస్ట్ చేస్తూ కనిపించారు. డిన్నర్ టేబుల్, రొమాంటిక్ లైట్ సెట్‌అప్ చూస్తే, అది ఒక ఇంటిమేట్ డైనింగ్ ముమెంట్ అనిపిస్తోంది. ముఖ్యంగా, బ్లూ డెనిమ్ షర్ట్ వేసుకుని సమంత ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరన్న దానిపై నెట్టింట్లో హాట్ డిస్కషన్ మొదలైంది.
“అందరూ కొత్త ప్రొడక్ట్ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఆ బ్లూ షర్ట్ వ్యక్తి గురించి ఎవరూ చెప్పడం లేదు?” అని ఒక ఫ్యాన్ కామెంట్ చేయగా, మరోవాడు “అది సీక్రెట్ గానే ఉండటమే మంచిది” అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.
ఈ మిస్టరీ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరికి మాత్రం అతను ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిదిమోరు కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటీవలే ఓ ఈవెంట్‌లో సమంత, రాజ్ నిదిమోరు కలిసి చేతులు పట్టుకుని ఉన్న ఫొటో వైరల్ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య కొత్త రొమాన్స్ మొదలైందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అయితే ఇప్పటి వరకు సమంత గానీ, రాజ్ గానీ ఈ వార్తలపై స్పందించలేదు. మరి సమంత తన లవ్ లైఫ్ గురించి మరిన్ని హింట్స్ ఇస్తారా? లేక ఇది కేవలం ఓ ఫ్రెండ్‌షిప్ మాత్రమేనా? అన్నది చూడాలి!