HomeTelugu Trendingసలార్-2 ఇంకా అదిరిపోతుందన్న ప్రభాస్

సలార్-2 ఇంకా అదిరిపోతుందన్న ప్రభాస్

Prabhas comment on Salaarప్రభాస్ తాజా చిత్రం సలార్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. కలెక్షన్ల పరంగా రికార్డులవైపు దూసుకెళ్తోంది. ప్రభాస్ కెరీర్లో మరో సూపర్ హిట్ పడింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన ఓ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సలార్ మూవీ కథ ప్రభాస్‌కు ఎంతో బాగా నచ్చిందట. అందుకే కథను విన్న వెంటనే ఓకే చెప్పానంటున్నాడు ప్రభాస్. తన కెరీర్లో ‘బాహుబలి’ ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసిందని, ఆ తర్వాత సినిమాలన్నీ దానికి భిన్నంగా ఉండేలా చూసుకున్నానని అన్నాడు. ప్రేక్షకులు కూడా వెరైటీ కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారని అందుకే ‘సలార్’ సినిమాకు ఓకే చెప్పానని అన్నాడు.

సలార్ రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ అంటున్నాడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి అన్నాడు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాలను గుర్తిస్తున్నారని అన్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా గుర్తింపు వస్తోందని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!