ప్రభాస్‌ ‘సాహో’ టీజర్‌ వచ్చేస్తుంది

బాహుబలి మూవీతో ఇండియన్‌ స్టార్‌గా ఎదిగాడు యంగ్‌ రెబల్‌ ప్రభాస్‌. ప్రస్తుతం ప్రభాస్‌ సినిమాలన్నీ ప్యాన్‌ ఇండియన్‌ చిత్రాలు కాగా.. ‘సాహో’ మూవీతో ఇండియన్‌ స్క్రీన్‌పై మునుపెన్నడు చూడని యాక్షన్‌ సీన్స్‌ను చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే యాక్షన్‌ సీన్స్‌కు సంబంధించిన ప్రోమోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. ఇక సినిమా గురించి ప్రభాస్‌ అభిమానులే కాకుండా.. సగటు సినీ ప్రేక్షకుడు ఎదరుచూస్తూ ఉండగా.. ఆ క్షణాలు దగ్గరకు రాబోతున్నాయి.

దీనిలో భాగంగానే సాహో టీజర్‌ను విడుదల చేయబోతోంది చిత్రయూనిట్‌. జూన్‌ 13న ఈ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు.. 14నుంచి థియేటర్లలో దీన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యూవీ క్రియేషన్స్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. సుజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.