HomeTelugu Big Storiesప్రభాస్‌ లాంటి హీరో ఎక్కడా లేరు: ప్రశాంత్ నీల్

ప్రభాస్‌ లాంటి హీరో ఎక్కడా లేరు: ప్రశాంత్ నీల్

Prashant neel reaction on p
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రకటించిన కొత్త చిత్రం సలార్‌. దీంతో ఈ పేరు గత రెండు రోజులుగా సోషల్‌ బాగా వినిపిస్తుంది. కే. జి.ఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ వైరల్‌ అయింది. ప్రభాస్ మాస్‌లుక్ పై కొందరు ట్రోలింగ్ మొదలు పెట్టారు. కన్నడలో అంత మంది హీరోలు ఉన్నప్పుడు ఒక తెలుగు హీరోను ఈ సినిమా కోసం ఎందుకు తీసుకున్నారు అంటూ కన్నడ అభిమానులు కొందరు ప్రశాంత్ ను టార్గెట్ చేశారు.

దీనిపై దర్శకుడు ప్రశాంత్‌ స్పందించాడు. ఈ కథకు ప్రభాస్ తప్ప మరో హీరో తనకు కనిపించడం లేదని కుండబద్దలు కొట్టాడు. ప్రభాస్ వంటి హీరో కన్నడ లోనే కాదు.. ఎక్కడా లేడని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. తన కథకు అమాయకమైన లుక్స్ ఉండే స్టార్ హీరో కావాలని.. ప్రభాస్ లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. అలాంటి క్వాలిటీస్ ఉన్న మరో హీరో తనకు కనిపించలేదని.. ప్రభాస్ అయితే ఇలాంటి పాత్రలకు సరిగ్గా సరిపోతాడు అని చెప్పాడు ప్రశాంత్. ‘సలార్’ లాంటి డార్క్ యాక్షన్ సినిమాకి అమాయకత్వంతో అవసరం ఏంటి అని చాలామందికి అనుమానం వస్తుంది.. కానీ తన కథలో హీరో ముందు అమాయకంగా ఉండి ఆ తర్వాత ఒక నాయకుడిగా ఎదిగాడు అనేది చూపిస్తున్నాను అంటున్నాడు.

ఇన్నోసెంట్ గా ఉండే హీరో కరుడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడు అనే జర్నీ చూపించడంలో ప్రభాస్ నటన మరో స్థాయిలో ఉంటుంది అంటున్నాడు ప్రశాంత్. ఈ క్రమంలో ‘సలార్’ అనే పదానికి అర్ధం కూడా చెప్పాడు. సలార్ అంటే ఉర్దూ పదం. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా నాయకుడు అంటారు. దానికి పర్ఫెక్ట్ అర్థం కావాలి అంటే కమాండర్-ఇన్-చీఫ్ అని. తన సినిమాకి సంబంధించి ‘సలార్’ అంటే కుడిభుజం లాంటి ఓ వ్యక్తి జనరల్ గా ఎలా ఎదిగాడనే విషయాన్ని చూపించనునట్లు తెలిపాడు దర్శకుడు ప్రశాంత్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!