బైక్ పై రొమాన్స్.. వీడియో వైరల్

బైక్‌పై వెళుతున్నప్పుడు ప్రియురాలు వెనుకుంటే కుర్రాళ్లకు పట్టపగ్గాలుండవు. బైక్‌ ముందున్న ట్యాంక్‌పై గాల్‌ ఫ్రెండ్‌ కూచుని ప్రియుడి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో వీడియోకు చిక్కింది ఈ రొమాంచిత దృశ్యం. లోకంతో తమకు పనిలేదన్నట్టుగా బిజీ రోడ్డుపై ఓ ప్రేమ జంట చేసిన ఈ విన్యాసం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డన్‌ క్రాస్‌ రోడ్డులో ప్రేమ పక్షులు బైక్‌పై దూసుకెళ్లిన ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి హెచ్‌జీఎస్‌ ధలివాల్‌ ట్వీట్‌ చేశారు. ‘మోటారు వాహనాల చట్టంలో కొత్త సెక్షన్‌ తేవాల్సిన అవసరం ఉంద’ని క్యాప్షన్‌ పెట్టారు.

గులామ్‌ సినిమాలో ‘జాదూ హై తేరా హీ జాదూ’ పాటలో ఆమిర్‌ఖాన్‌, రాణిముఖర్జీ చేసినట్టుగా ఫీట్‌ చేసిన ఈ ప్రేమికులు ఎవరో ఇప్పటివరకు తెలియలేదు. యువకుడు బైక్‌ నడుపుతుండగా ముందున్న ప్యూయల్‌ ట్యాంక్‌పై కూర్చొని యువతి తన రెండు చేతులను అతడి భుజానికి చుట్టేసి ప్రియుడి కళ్లలోకి చూస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇద్దరూ హుషారుగా బైక్‌పై వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది. చట్టప్రకారం ఇది నేరం కానప్పటికీ చాలా ప్రమాదకరం. రద్దీగా ఉన్న రోడ్డుపై ఇలాంటి విన్యాసాలతో ప్రమాదం కొనితెచ్చుకోవడం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే నడిరోడ్డుపై ఈ రొమాన్స్‌ ఏంటని నిలదీస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates