HomeTelugu Trendingథియేటర్లలో ప్రభాస్‌ ఫాన్స్‌ రచ్చ.. వీడియో షేర్‌ చేసిన శ్రద్ధ

థియేటర్లలో ప్రభాస్‌ ఫాన్స్‌ రచ్చ.. వీడియో షేర్‌ చేసిన శ్రద్ధ

5 13ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ మూవీ టీజర్‌ దూసుకెళుతోంది. ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల మందికి పైగా టీజర్‌ను వీక్షించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో శ్రద్ధను సర్‌ప్రైజ్‌ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘సాహో’ టీజర్‌ను ప్రదర్శించారు. టీజర్‌ చూస్తూ అభిమానులు ఈలలు వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ రచ్చ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ప్రభాస్‌తో, సుజీత్‌తో కలిసి పనిచేయడం ఓ కలలా ఉంది. చిత్రబృందం పడిన రెండేళ్ల కష్టానికి ఈ రకమైన స్పందన చూసి చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అయితే శ్రద్ధ పోస్ట్‌ చేసిన వీడియో ఇక్కడి థియేటర్‌ లోనిదా? లేక ముంబయిలోని థియేటర్‌లో చిత్రించిందా అన్నది తెలియరాలేదు. ‘సాహో’ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!