సమంత ‘ఓ బేబీ’ టైటిల్‌ సాంగ్‌

ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఓ బేబీ.. ఓ బేబీ..’ అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో ఫన్నీగా ఉంది. పాటలో సమంత అల్లరి చేష్టలు నవ్వులు పూయించాయి. లక్ష్మి, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు. కొరియన్‌ కామెడీ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ కు ఇది రీమేక్‌గా రాబోతోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.