HomeTelugu Trendingశ్రీకారం నిర్మాతలకు శర్వానంద్‌ లీగల్‌ నోటీసులు!

శ్రీకారం నిర్మాతలకు శర్వానంద్‌ లీగల్‌ నోటీసులు!

Sharwanand Legal Notice to
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూలు చేయకపోవడంతో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ వారికి హీరో శర్వాకు మధ్య రెమ్యూనరేషన్ వివాదం తలెత్తిన్నట్లు వినికిడి. వివరాల్లోకి వెళ్తే.. ‘శ్రీకారం’ చిత్రానికి శర్వానంద్‌ రూ.6 కోట్లు రెమ్యూనరేషన్‌ అడిగారట. ఇందులో ఇప్పటికే హీరోకి 4 కోట్లు చెల్లించగా.. విడుదల తర్వాత ఇస్తామన్న 2 కోట్లలు నిర్మాతలు పెండింగ్ లో పెట్టారట. సినిమా విడుదలై చాలా రోజులవుతున్నా.. నిర్మాతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ వారికి శర్వా లీగల్ నోటీసులు పంపారని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!