హాలీవుడ్ వెబ్‌ సీరీస్‌లో శృతి హాసన్‌..!

హీరోయిన్‌ శృతి హాసన్.. వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సమయంలో సడెన్ గా ప్రేమలో పడి ప్రియుడి కోసం లండన్ చెక్కేసింది. అక్కడ కొన్నాళ్ళు ఆల్బమ్స్ చేసిన శృతికి కలిసి రాకపోవడంతో.. వెనక్కి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో రవితేజతో సినిమా చేస్తున్నది.

అలాగే, మరో రెండు మూడు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటె శృతి హాసన్ హాలీవుడ్ లో ట్రెండ్ స్టోన్ అనే సీరీస్ లో నటించే అవకాశం దక్కింది. యుఎస్ నెట్వర్క్ సంస్థ ఈ సీరీస్ ను నిర్మిస్తోంది. ఇందులో శృతి హాసన్ వెయిట్రెస్ గా చేస్తూ సీక్రెట్ గా హత్యలు చేసే అమ్మాయిగా నటిస్తోందని తెలుస్తోంది.

థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఇండియా, యుఎస్ లో షూట్ చేస్తున్నారు. ఈ సిరీస్ కనుక హిట్టయితే.. ప్రియాంక చోప్రాకు ఎలాగైతే హాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయో అదే విధంగా శృతి హాసన్ కు కూడా తప్పకుండా అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు.