‘ఓ బేబీ’ చీఫ్‌ గెస్ట్‌లు వీరే!

సమంత ఓ బేబీ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం జరగబోతున్నది. సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో అంచనాలు పెరిగాయి. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఈ చిత్రం రీమేక్. ఓ బేబీ భారం మొత్తం సమంత భుజస్కందాలపై ఉన్నది. ఆ భారాన్ని ఎలా మోస్తుందో చూడాలి.

ఈరోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ లుగా ఎవరు వస్తున్నారు అనేదానిపై నిన్నటి వరకు ఉత్కంఠత ఉన్నది. నేటితో ఈ ఉత్కంఠతకు తెరపడింది. చీఫ్ గెస్ట్ గా వెంకటేష్, రానాలు వస్తున్నారు. ఎలాగో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ బ్యాక్ బోన్ గా ఉన్నది కాబట్టి సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.