వేణుమాధవ్‌ ఇంట విషాదం

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ సోదరుడు విక్రమ్‌బాబు (54) మరణించారు. గుండెపోటుతో నిన్న ఆయన తుది శ్వాస విడిచారు. విక్రమ్‌ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాప్రాలో హెచ్‌బీ కాలనీలోని మంగాపురంలో నివాసముంటున్న విక్రమ్‌బాబు కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొమ్మిది రోజుల క్రితమే విక్రమ్‌ బాబు కుమార్తె వివాహం జరిగింది. ఇంతలోనే ఆయన మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.