ఇద్దరు హీరోయిన్‌లతో విజయ్‌ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నది. అర్జున్ రెడ్డి తరువాత ఈ క్రేజ్ అమంతంగా పెరిగింది. రౌడీగా పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్ లో జరుగుతున్నది. ఈ చిత్రంలో విజయ్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు ఐశ్వర్య రాజేష్ కాగా, రెండో హీరోయిన్ ఇజబెల్లా లియాట్.

ఇద్దరి మధ్య నలిగే ప్రేమికుడిగా విజయ్ కనిపించబోతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో విజయ్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.