HomeTelugu Trendingనేపాల్‌ ప్రజలకు 'ఆదిపురుష్‌' టీమ్‌ క్షమాపణలు

నేపాల్‌ ప్రజలకు ‘ఆదిపురుష్‌’ టీమ్‌ క్షమాపణలు

Aadipurush Movie Review
హీరో ప్రభాస్ హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ టీ సిరీస్ రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దాదాపు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్‌ వీపరితంగా ట్రోల్స్‌కు గురైయ్యాయి. ఇక విడుదల తరువాత కూడా ఈ సినిమాని విమర్శలూ వివాదాలూ చుట్టుముడుతున్నాయి.

ఈ సినిమా మేకింగ్ నుంచి డైలాగ్స్ వరకు లుక్స్ నుంచి ప్రెజెంటేషన్ వరకు… ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రామాయాణాన్ని వక్రీకరించి సినిమా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆదిపురుష్ సినిమాలో సీత జన్మస్థలం భారతదేశం అని అర్థం వచ్చేలా ఒక డైలాగ్ ఉంటుంది. అయితే దీనిపై ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం స్పందించింది. రామాయాణాన్ని వక్రీకరించేలా సినిమా చేశారని… అక్కడి నేపాల్ ప్రభుత్వ నేతలు భారతీయ సినిమాలపై నిషేధం విధించారు.

ఆదిపురుష్ లో సీత జన్మస్థలం గురించి అభ్యంతరంగా ఉన్న డైలాగ్ ను తీసివేసి క్షమాపణలు చెప్పకపోతే భారతీయ సినిమాలను నేపాల్ లో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఆదిపురుష్ చిత్ర బృందం స్పందించింది. భారతీయ చిత్రాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఖాట్మండు మేయర్ ను అభ్యర్థించింది. టీ-సిరీస్ ఖాట్మండు మేయర్ కు క్షమాపణలు చెబుతూ ఓ లేఖను రాసింది.

లేఖలో ఏం రాశారంటే… “నేపాల్ ప్రజల మనోభావాలను ఏ విధంగా అయినా దెబ్బతీసి ఉంటే మమ్మల్ని క్షమించాలి… మేము ఉద్దేశ్య పూర్వకంగా ఎవరి సామరస్యాన్ని దెబ్బతీయాలనుకోలేదు. ఈ చిత్రాన్ని కళాత్మక కోణంలో మాత్రమే చూడాలని కోరుకుంటున్నాం. చరిత్రపై ఆసక్తిని కలిగించడానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చేరుకోవాలనే మా ఉద్దేశ్యానికి మద్దతు ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము”. అంటూ లేఖలో పేర్కొన్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!