చరణ్ విలన్ ను ప్రభాస్ తీసుకున్నాడు!

బాహుబలి వంటి క్రేజీ ఫిల్మ్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో ‘సాహో’పై ప్రేక్షకులపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ప్రభాస్ మార్కెట్, క్రేజ్ రెండూ బాగా పెరగడంతో మేకర్స్ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ఆయా ప్రాంతపు నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ను విలన్ గా ఎంపిక చేసుకున్నారు. ఆయనతో పాటు మరో బాలీవుడ్ యాక్టర్ చంకీ పాండేను కూడా ఈ సినిమాలో భాగంగా చేశారు. ఇప్పుడు ఓ తమిళ నటుడుని ఈ సినిమా కోసం రంగంలోకి దింపనున్నారు. అతడే అరుణ్ విజయ్. కోలీవుడ్ లో అరుణ్ కు మంచి పేరుంది. అతడు అజిత్ కు విలన్ గా నటించిన సినిమా ‘ఎంతవాడు గానీ’ పేరుతో తెలుగులో విడుదలైంది.
ఆ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో విలన్ గా అరుణ్ విజయ్ ను ఎన్నుకున్నారు. ఈ రెండు సినిమాలతో అరుణ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు తమిళ ఆడియన్స్ ను ఆకర్షించడానికి అరుణ్ ను ‘సాహో’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణదశలో ఉంది. ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.