బాహుబలి @1000 కోట్లు!

బాహుబలి ది కన్‌క్లూజన్ మూవీ భారతీయ చిత్ర సీమలో 1000కోట్ల కొల్లగొట్టి సంచలనంగా మారింది. ఇప్ప‌టికే ఉన్న రికార్డుల‌న్నింటిని బ్రేక్ చేస్తూ.. ఈ మూవీ వెయ్యి కోట్ల సాధించిన మొట్ట‌మొద‌టి ఇండియ‌న్ ఫిలింగా రికార్డు క్రియేట్‌ చేసింది. విడుదలై కేవలం తొమ్మిదిరోజుల్లోనే.. వెయ్యికోట్ల క్లబ్‌లో చేరడం అనేది సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి.

ఈ సినిమా విడుద‌లకు ముందు భారీ క‌లెక్ష‌న్లు ప‌క్కా అని అంచ‌నా వేసినా.. మ‌రీ ఇంత దూకుడుగా ఉంటాయ‌ని మాత్రం అనుకోలేదు. ట్రేడ్ ఎన‌లిస్ట్ ల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ.. దూసుకెళుతున్న ఈ చిత్రం రూ.1500 కోట్లు సాధించ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. తాజాగా 1000 కోట్లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెం.1 చిత్రంగా జెండా పాతేసిందని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.