HomeTelugu Trendingప్రమాదానికి కారణం నేను కాదు: హీరో సుధాకర్‌

ప్రమాదానికి కారణం నేను కాదు: హీరో సుధాకర్‌

9 26టాలీవుడ్‌ హీరో సుధాకర్ శనివారం జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ‘నువ్వు తోపురా’ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాకు వెళ్లిన సుధాకర్ మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సమయంలో సుధాకర్ కారు ఢీకొని లక్ష్మి అనే మహిళ మృతి చెందారు.

అయితే ఈ ఘటనలో తానే డ్రైవింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను సుధాకర్ ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘నువ్వు తోపురా’ చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా సుధాకర్‌ ఘటన జరిగిన విధానాన్ని వివరించారు. ‘నేను డ్రైవర్ పక్కసీటులో ఉన్నాను. కారు ట్రక్కుకు తగలడంతో ప్రమాదం జరిగింది. నేను డ్రైవింగ్‌ చేయలేదు. నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. మహిళ మృతి నన్ను ఎంతగానో బాధించింది. ఈ ఘటనకు నేను కారణం కాదు. ఆ సమయంలో డ్రైవర్ కారుని నడుపుతున్నారు. డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. మృతురాలు కుటుంబానికి మా చిత్ర బృందం తరఫున, ప్రత్యేకంగా నేను సాయం చేస్తాను’ అని స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!