
ఈరోజు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలసిందే. ఈ క్రమంలో సినిమా థియేటర్లన్నీ జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. థియేటర్ల దగ్గర జాతరను తలిపించే వాతావరణం కనిపిస్తోంది. సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇంకోవైపు, ప్రతి థియేటర్ లో ఆంజనేయస్వామి కోసం ఒక సీటును కేటాయించాలి అని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటించిన విధంగానే ప్రతి థియేటర్ లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచారు. కొన్ని థియేటర్లలో హనుమంతుడి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇదిలావుంచితే, ఈ సినిమా చూసేందుకు ఒక కోతి థియేటర్ కు రావడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సాక్షాత్తు హనుమంతుడే వచ్చాడని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
Hanuman ji watching #Adipurush
— Prabhas matters 🤞 (@Single_Sintakay) June 16, 2023













