అసలు సంబంధాలే చూడలేదట!

గత కొంత కాలంలో టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. అతడి పెదనాన్న కృష్ణంరాజు సంబంధాలు చూస్తున్నామని.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని అన్నారు. కానీ ప్రభాస్ తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజానికి పెళ్లి టాపిక్ తెస్తుంటే ప్రభాస్ దాటేస్తున్నాడని.. పెళ్లి గురించి తనేమీ మాట్లాడకపోవడంతో కృష్ణంరాజు సీరియస్ ఆయ్యారని టాక్. అయితే తాజాగా ప్రభాస్ కు ఇదే ప్రశ్న ఎదురైంది.

దానికి ఆయన సమాధానంగా అసలు ఇంట్లో సంబంధాలు చూడడం లేదు. ఆ సంగతి కూడా నాకు తెలియదు.. అంటూ సమాధానం చెప్పాడు. అంటే ఇన్నిరోజులు మీడియాలో ప్రభాస్ పెళ్లిపై వచ్చిన వార్తల్లో నిజం లేదా..? వైజాగ్ లో, ఈస్ట్ గొదావరిలో అమ్మాయిలను చూశామని రకరకాల వార్తలు వచ్చాయి. మరి వాటి సంగతేంటో..?