సూర్య జగన్ పాత్ర చేయడం లేదంట!

దర్శకుడు మహి వి రాఘవ్ గతంలో రూపొందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కు కొనసాగింపుగా ‘యాత్ర 2’ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం మొత్తం వైఎస్సార్ వారసుడు వైఎస్ జగన్ జీవితం ఆధారంగా ఉంటుందట. కాంగ్రెస్ నుండి జగన్ బయటకు రావడం, కోర్టు కేసులు, జైలు శిక్ష, యాత్ర, ముఖ్యమంత్రి పదవి సాధించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయట.

ఇకపోతే జగన్ పాత్ర కోసం స్టార్ నటుడు సూర్య అయితే బాగుటుందని మహి వి రాఘవ్ భావించారని, ఈ విషయమై సూర్యను సంప్రదించగా ఆయన ఒప్పుకున్నారని వార్తలొచ్చాయి. కానీ సూర్య మాత్రం తాను జగన్ పాత్రను చేయడంలేదని అన్నారు. కొత్త చిత్రం ‘ఎన్జీకే’ ప్రమోషనల్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియా సమావేశంలో ఈ సంగతి చెప్పారు.