చిరు, పవన్ లతో సినిమా చేయాలనుంది!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో కలిసి సినిమా చేయాలనుందని వెల్లడించారు. ప్రస్తుతం ఇదొక హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తోంది. స్టార్ హీరో హోదాలో ఉన్న ఎవరు కూడా మరొక హీరోను పొగడడం అంటే చాలా అరుదు. అటువంటిది బాలీవుడ్ అగ్ర హీరోగా వెలుగొందుతోన్న అమీర్ ఖాన్ చిరు, పవన్ ల పేర్లు చెప్పి వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తోన్న ‘దంగల్’ సినిమా త్వరలోనే ‘యుద్ధం’ పేరుతో తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న అమీర్ ఖాన్ తెలుగులో తనకు చిరు, పవన్ కల్యాణ్ లతో కలిసి పని చేయాలనుందని, వాళ్ళంటే చాలా ఇష్టమని అన్నారు. అలానే తమిళంలో రజినీకాంత్ అంటే ఎంతో అభిమానమనీ.. ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.