Telugu Big Stories

Allu Arjun కొత్త సినిమాలో విలన్ గా మారిన శ్రీ వల్లి?

Allu Arjun - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో రష్మిక మందన్నా విలన్‌గా నటించనుందని బాలీవుడ్ మీడియా ప్రచారం. ఇప్పటికే ముంబైలో రెండు షెడ్యూల్‌లు పూర్తవగా, దీపికా, జాన్వి, మృణాళ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Aamir Khan పై తిరగబడిన ఫ్యాన్స్.. ఇక నటన ఆపేయాలా?

"సితారే జమీన్ పర్" తర్వాత Aamir Khan నటనపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫ్యాన్స్ కొంతమంది ఆయన నటనను బలహీనంగా భావిస్తున్నారు. కానీ నిర్మాతగా మాత్రం ఆయన ప్రతిభను అందరూ ప్రశంసిస్తున్నారు.

ఒకే నెలలో 3 బ్లాక్‌బస్టర్లు: Naga Vamsi గేమ్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్?

సితార ఎంటర్టైన్మెంట్స్‌ Naga Vamsi ఒక నెలలో మూడు పెద్ద సినిమాలతో Tollywoodలో సంచలనం రేపుతున్నారు. కింగ్‌డమ్, వార్ 2, మాస్ జాతర సినిమాల విడుదలతో భారీ బెట్టింగ్‌లు వేసిన నాగ వంశీకి, ఇవన్నీ హిట్ అయితే బిగ్ లాభాలే.

రియల్ ఎస్టేట్ స్కామ్ లో Mahesh Babu పేరు.. షాక్ లో ఫ్యాన్స్..

మహేశ్ బాబు ప్రమోట్ చేసిన Sai Surya Developers పై ఫిర్యాదు చేస్తూ ఒక డాక్టర్ రూ.34.8 లక్షలు మోసపోయినట్టు పేర్కొంది. రంగారెడ్డి కన్జూమర్ కమిషన్ notices జారీ చేసింది. ED కూడా ఆయనను మనీ లాండరింగ్ కేసులో విచారిస్తోంది. అయినా మహేశ్ ప్రస్తుతం SSMB29 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

OG ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత Pawan Kalyan రియాక్షన్ ఏంటో తెలుసా?

OG మూవీ ఫస్ట్ హాఫ్ చూసిన పవన్ కల్యాణ్ కొన్ని మార్పులు సూచించారట. సెప్టెంబర్ 25న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదల కాబోతోంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీగా ఉన్నారు! OG, OG Movie Update

War 2 రిలీజ్ కి పెద్ద స్కెచ్.. మామూలుగా ప్లాన్ చేయలేదుగా..

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న War 2 సినిమా ఆగస్టు 14, 2025న 7,500 స్క్రీన్‌లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. యాక్షన్, స్కేల్‌, స్టార్డమ్ అన్నీ కలిపి ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను వర్కౌట్ చేసేందుకు రెడీగా ఉంది ఈ భారీ స్పై థ్రిల్లర్.

Ram Charan మీద దుమ్మెత్తి పోస్తున్న నిర్మాతలు.. ఎందుకు?

Ram Charan పై నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి. శిరీష్ క్షమాపణ చెప్పినా, వివాదం సాగింది. దిల్ రాజు సమర్థన, ఇతర నిర్మాతల మద్దతుతో చరణ్ ఇమేజ్ నిలబెట్టుకున్నాడు. ఇది టాలీవుడ్‌లో హీరోల ప్రభావాన్ని చూపించింది.

తమిళ్ హీరోలపై కోట్లు కురిపిస్తున్న Tollywood Producers.. ఎందుకు?

Tollywood Producers భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ రిజల్ట్స్ అంతగా రావడం లేదు. "థగ్ లైఫ్", "కూలీ" లాంటి సినిమాలపై భారీ రిస్క్ తీసుకుంటున్నారు. మరోవైపు, తమిళ నిర్మాతలు మాత్రం మన తెలుగు హీరోల సినిమాల హక్కులపై ఆసక్తి చూపడం లేదు.

Tollywood 2025 లో హిట్‌లు కంటే ఫ్లాప్‌లే ఎక్కువా?

Tollywood 2025 మొదటి ఆరు నెలల్లో టాలీవుడ్‌కి పెద్దగా హిట్లు లేవు. వెంకటేశ్, నాగ చైతన్య, నాని, శ్రీ విష్ణు సినిమాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. గేమ్ ఛేంజర్, జాక్ లాంటి పెద్ద సినిమాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. డబ్బింగ్ సినిమాల్లో "డ్రాగన్" మాత్రమే విజయం సాధించింది.

వారాంతం కి Kannappa కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

విష్ణు మంచు నటించిన 'Kannappa' సినిమా మూడు రోజుల్లో ₹23.75 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్‌కి అత్యధిక స్పందన లభించింది. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ కెమియోస్ హైలైట్. ఇది విష్ణు కెరీర్‌లో Biggest Opening Weekend కావడం విశేషం.

Oppenheimer మీద తీవ్ర విమర్శలు చేసిన James Cameron

ఒప్పెన్హైమర్‌ సినిమా హిరోషిమా బాంబ్ ఎఫెక్ట్స్ చూపించకపోవడంపై James Cameron తీవ్ర విమర్శలు చేశారు. నోలన్ నిర్ణయాన్ని "మోరల్ కాప్-అవుట్"గా అభివర్ణించిన కామెరూన్, త్వరలో 'గోస్ట్‌స్ ఆఫ్ హిరోషిమా'తో ఆ వాస్తవ దృశ్యాలను చూపించబోతున్నారు.

Coolie ఓవర్ సీస్ రికార్డు స్థాయిలో.. Rajinikanth క్రేజ్ మామూలుగా లేదుగా!

రజనీకాంత్ Coolie ఓవర్సీస్ రైట్స్ రూ. 90 కోట్లకి అమ్ముడయ్యాయన్న వార్తలతో ట్రేడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఇది కోలీవుడ్‌లో రికార్డు స్థాయి డీల్. కానీ ఈ భారీ బిజినెస్ బ్రేక్ ఈవెన్ అయ్యేనా? పాజిటివ్ టాక్, ప్రమోషన్ల మీదే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.

Kannappa Review: మంచు విష్ణు డబుల్ రిస్క్.. కానీ ఫలితం ఏంటి?

Kannappa Review: మంచు విష్ణు నటించిన కన్నప్ప మొదటి భాగంలో బలహీనంగా సాగినా, క్లైమాక్స్ భాగంలో మానసికంగా ఆకట్టుకుంటుంది. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు పాత్రలు సినిమాకు వన్నె తెచ్చాయి. డివోషనల్ టచ్ బాగుండి, విజువల్స్ ఆకట్టుకున్నాయి. కథన బలహీనత వల్ల ఫుల్ ఫలితం అందలేదు.

Allu Arjun డెలివరీ బాయ్‌ గా? రామ్ చరణ్ జ్యూస్ అమ్ముతూ..

AI టూల్స్‌తో టాలీవుడ్ స్టార్లను సాధారణ వృత్తులలో చూపించే వీడియో వైరల్‌గా మారింది. Allu Arjun నుండి ఎన్టీఆర్ వరకు, ప్రతి హీరో వినోదాత్మక పాత్రలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

SSMB29 విషయంలో రాజమౌళి ఇంతకు ముందు ఎప్పుడూ చేయని ప్రయోగం!

SSMB29తో రాజమౌళి కొత్త ప్రయోగం చేస్తున్నారు. సెట్స్, రియల్ లొకేషన్లు, గ్రాఫిక్స్‌కి సమాన ప్రాధాన్యం ఇస్తూ, మహేష్ బాబుతో గ్లోబల్ యాడ్వెంచర్ ఫిల్మ్ తీస్తున్నారు. సినిమా కోసం హైదరాబాద్‌లో రూ.50 కోట్ల విలువైన కాశీ సెట్ నిర్మిస్తున్నారు.

Bigg Boss Telugu 9 లో ఎవరు ఎంటర్ అవుతున్నారు? లీక్‌డ్ లిస్ట్ షాక్!

Bigg Boss Telugu 9 సీజన్ కోసం క్రేజీ కంటెస్టెంట్స్‌ లిస్ట్ లీక్‌ అయింది. ‘మై విలేజ్ షో’, సీరియల్స్, యూట్యూబ్‌, ‘జబర్దస్త్‌’ నటులు ఉన్నారు. షో విజయవంతం కావాలంటే ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు వివాదాలు అవసరం అన్నట్టు స్ట్రాటజీ ప్లాన్ చేశారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒకే సినిమాలో 3 Khans of Bollywood.. మామూలు న్యూస్ కాదు..

ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ – షారుఖ్, సల్మాన్‌తో కలిసి మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచనను వీరిద్దరూ అంగీకరించారని వెల్లడించాడు. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని సిరీస్‌ రూపంలో రూపొందించాలన్న యోచనలో ఉన్నాడని చెప్పారు. 3 Khans of Bollywood ఒకే సినిమాలో అనే ప్రకటన ఖాన్ ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహాన్ని నింపింది.

Mega 157 లో చిరంజీవి పాత్ర ఇదేనా?

Mega 157 సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ ఎంటర్టైనర్ ప్రారంభించారు. స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు కామెడీ టైమింగ్, డాన్స్, యాక్షన్ ఓ డిఫరెంట్ లెవెల్‌లో ఉండనుంది. నయనతార, కాథరిన్ త్రెసా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2026 సంక్రాంతి విడుదల లక్ష్యంగా షూటింగ్ వేగంగా సాగుతోంది.

Sitaare Zameen Par మొదటి రోజు కలెక్షన్స్ తో బాలీవుడ్ కూడా షాక్ అయ్యిందా!

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన Sitaare Zameen Par జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రారంభ రోజే ఈ సినిమా ₹11.78 కోట్ల కలెక్షన్ సాధించింది. స్పానిష్ మూవీ చాంపియన్స్ కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం, ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో జాతీయ బాస్కెట్‌బాల్ గెలుపు కథను తెలుపుతుంది.

Lagaan సినిమా బాలీవుడ్ ని ఇంతలా మార్చిందా?

Lagaan సినిమా 2001లో విడుదలై బాలీవుడ్‌లో స్పోర్ట్స్ సినిమాల ట్రెండ్‌ను ప్రారంభించింది. క్రికెట్‌తో పాటు సామాజిక సందేశాలను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దంగల్, చక్ దే ఇండియా లాంటి సినిమాలకు ఇది ప్రేరణగా మారింది. లగాన్‌తో దర్శకుల దృక్పథం మారిపోయింది. ఇది భారత సినిమా చరిత్రలో మైలురాయి అయ్యింది.

రూ.105 కోట్లకి నెట్‌ఫ్లిక్స్‌తో Ram Charan భారీ డీల్ గురించి విన్నారా?

Ram Charan నటిస్తున్న "పెద్ది" సినిమా డిజిటల్ హక్కులు రూ.105 కోట్లకు Netflix కొనుగోలు చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా 2026 మార్చి 27న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

ఇద్దరు హీరోయిన్లు కావాలి అని Prabhas అడిగిన విషయం తెలుసా?

రాజా సాబ్ టీజర్ విడుదల కాగా, దర్శకుడు మారుతి - Prabhas మధ్య జరిగిన ఫన్నీ సంభాషణను పంచుకున్నారు. మూడు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయినా ప్రభాస్ తనపై నమ్మకం పెట్టుకున్నాడని మారుతి తెలిపారు.

అమీర్ ఖాన్ Sitaare Zameen Par కి ఆఖరి నిమిషంలో కూడా కష్టాలే..

Sitaare Zameen Par సినిమా సెన్సార్‌లో చిక్కుకుపోయింది. రెండు సీన్లను కత్తిరించాలన్న CBFC నిర్ణయాన్ని ఆamir ఖాన్ తిరస్కరించాడు. జూన్ 16న తుది పరిష్కారం కోసం మరోసారి కమిటీతో సమావేశం కానున్నారు. మరోవైపు, విదేశాల్లో ఇప్పటికే సినిమాకు సర్టిఫికేట్ వచ్చేసింది.

Samantha and Naga Chaitanya మళ్ళీ కలవనున్నారా?

"యే మాయ చెసావే" రీ-రిలీజ్ సందర్భంగా Samantha and Naga Chaitanya కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లారు. సమంత రెడీ అయినా, నాగ చైతన్య దూరంగా ఉండే అవకాశం ఎక్కువ అంటున్నారు.

Mythri Movie Makers వేసిన మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఏంటంటే..

Mythri Movie Makers త్వరలో ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ప్రారంభించనున్నారు. భారీ రెమ్యునరేషన్‌ల స్థానంలో లాభాలను పంచుకోవడమే లక్ష్యం. రిస్క్ తగ్గించేందుకు ఇది మంచి మార్గంగా పరిశ్రమలో మార్పులు తీసుకురానుంది.

హైదరాబాద్ నుండి Shah Rukh Khan కు రూ.300 కోట్ల ఆఫర్? అసలు నిజం ఇదే!

Shah Rukh Khan కు మైత్రీ మూవీ మేకర్స్ రూ.300 కోట్లు ఆఫర్ చేశారన్న వార్తలు పుకార్లే. ప్రస్తుతం షారుఖ్ తన 'కింగ్' సినిమాపై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల గురించి 2025 చివర్లో నిర్ణయం తీసుకుంటారు. ‘కింగ్’లో భారీ స్టార్ క్యాస్ట్ కనిపించనున్నారు.

Karthi Kaithi 2 కోసం క్రేజీ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?

లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించనున్న Karthi Kaithi 2 సినిమాలో అనుష్క శెట్టి గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనుష్కను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం. కార్తి, అనుష్క కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా కానుంది. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

“సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని ఫేక్ ఐడీ తో ఫాలో అవుతున్నాను” అంటున్న Allu Aravind

మిత్ర మండలి టీజర్ విడుదలైంది. ప్రియదర్శి, నిహారిక NM కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో Allu Aravind సరదా వ్యాఖ్యలు చేశారు. విజయేంద్ర ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు RR ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ త్వరలో ప్రకటించనుంది.

Ram charan- Nikhil సినిమా షూటింగ్లో ప్రమాదం..!

రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా వస్తుంది సినిమా ది ఇండియా హౌస్. అయితే ఈ సినిమా షూటింగ్లో పెను ప్రమాదం జరిగింది.

Mangli పుట్టినరోజు వేడుకలో జరిగిన గంజాయి కలకలం ఏమిటంటే..?

ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు పార్టీలో గంజాయి స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
error: Content is protected !!