HomeTelugu Trendingఆది సాయికుమార్‌ 'తీస్‌ మార్‌ ఖాన్‌ గ్లాన్స్‌'

ఆది సాయికుమార్‌ ‘తీస్‌ మార్‌ ఖాన్‌ గ్లాన్స్‌’

Tees Maar Khan Glance

ఆది సాయికుమార్‌ హీరోగా కల్యాణ్‌ జి గోగణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నీ ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పూత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘తీస్‌ మార్‌ ఖాన్‌ గ్లాన్స్‌’ పేరుతో విడుదల చేసిన వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో ఆది విద్యార్థిగా, రౌడీగా, పోలీస్‌గా మూడు కోణాల్లో కనిపిస్తారు. ఓ కీలకమైన పాత్రలో సునీల్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామ’ ని మూవీ యూనిట్‌ తెలియజేసింది. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తుండగా.. బాల్‌ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!