HomeTelugu Trendingకల్యాణ్‌దేవ్‌కు హ్యాండిచ్చిన హీరోయిన్

కల్యాణ్‌దేవ్‌కు హ్యాండిచ్చిన హీరోయిన్

1 5
పులివాసు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ‘సూపర్ మచ్చి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. “ఈ సినిమాలో బార్ లో పని చేసే సింగర్ గా నటిస్తున్నాడు కల్యాణ్‌ దేవ్. ఒక పాటతో పాటు రెండు రోజుల టాకీపార్ట్‌ షూటింగ్ మిగిలి ఉందని కల్యాణ్ దేవ్ తెలిపారు.

ఈ కరోనా సమయంలోనూ ధైర్యంగా షూటింగ్ లో పాల్గొనడానికి మా సినిమా నిర్మాతలే కారణమని అన్నారు. నిర్మాతల ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలి, వారికి ఆర్థికపరమైన సమస్యలు రాకూడదని భావించాను. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ సినిమాలో మొదట రియా చక్రవర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ చేశాక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సినిమా ఉందంటూ మధ్యలోనే వెళ్లిపోయిందట. ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రచితా రామ్ ను ఎంపిక చేసుకుని మళ్లీ షూటింగ్ చేసినట్టు కళ్యాణ్ దేవ్ తెలిపారు.

ఇక షూటింగ్ లో పాల్గొనడం గురించి మామయ్య చిరంజీవి సలహా తీసుకున్నాను. ‘ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేయాలి కదా. నీకు ఓకే అనుకుంటే షూటింగ్ కి వెళ్లు’ అని అన్నారు. అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మామయ్య చెప్పారు” అని కల్యాణ్‌ దేవ్ అన్నారు. అంతే కాకుండా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లానని, ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ తనపనులు తానే చేసుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు . తమ మొదటి కూతురు బర్త్ డేకి ఇంట్లోనే ఉంటూ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!