Telugu News

సీఎం వైఎస్ జగన్‌ తొలి సంతాకం ఈ ఫైళ్ల పైనే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం.. ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు....

మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలి: వైఎస్‌ జగన్‌

మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తొలి సారిగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన సీఎం పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సచివాలయం మొదటి...

జగన్‌ జట్టు .. ఏ జిల్లా నుంచి ఎవరెవరు

ఏపీ మంత్రివర్గం కేటాయింపులో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాధాన్యం దక్కింది. ఈ నాలుగు జిల్లాలకు మూడేసి లెక్కన మంత్రి పదవుల్ని కేటాయించారు. అలాగే విజయనగరానికి రెండు, శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం,...

ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి

ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థులతో గుంటూరు జిల్లా...

ఏపీ మంత్రులు వీరే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుందో దాదాపు ఖాయమైంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం జగన్‌.. ఏ అంశాల ప్రాతిపదికన మంత్రులను నియమిస్తున్నది పార్టీ నేతలకు స్పష్టం చేశారు....

గవర్నర్‌ తో వైఎస్‌ జగన్‌ భేటీ

గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను ఆయనకు అందజేశారు. రేపు...

ప్రస్తుతం మేమిద్దరం స్నేహితులు మాత్రమే

ప్రస్తుతం మేమిద్దరం స్నేహితులు మాత్రమేప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల తాను మంచి స్నేహితులమని నటుడు విష్ణు పేర్కొన్నారు. తాజాగా 'రాక్షసన్‌'తో మంచి విజయాన్ని అందుకున్న విష్ణు.. ఇప్పుడు 'జగజ్జాల కిలాడి' చిత్రంలో...

జగన్‌లో ఎంతో మార్పు వచ్చింది: జెడీ చక్రవర్తి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిలో ఎంతో మార్పు వచ్చిందని అంటున్నారు సినీ నటుడు జేడీ చక్రవర్తి. ఆయన కీలక పాత్రలో నటించిన 'హిప్పీ' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ...

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం..!

తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ పార్టీలో టీ-కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ విలీన ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు గురువారం రాత్రి శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి. నరసింహా చార్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ...

ఏపీలో అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకం

అక్టోబరు 15నుంచి రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా పథకం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ...

ఎన్నికల్లో ఓటమిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..!

సాధారణ ఎన్నికల తర్వాత కొంత విరామం తీసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో...

పార్టీ నాయకులతో పవన్‌కల్యాణ్‌ భేటీ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం ఆ పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం వివిధ జిల్లాలకు...

వరల్డ్‌కప్‌ పోరులో ఘనంగా ఆరంభించిన కోహ్లి సేన

సౌతాంప్టన్లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్ బోణీ కొట్టింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన...

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 26 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే మంగళవారం రాత్రి సచివాలయంలోని...

ఊపిరి.. నాగ్‌, ఎన్టీఆర్‌లను అనుకున్నాడట

అక్కినేని నాగార్జున కెరీర్లో బెస్ట్ సినిమాల్లో ఊపిరి ఒకటి. ఫ్రెంచ్ లో విడుదలై సూపర్ హిట్టైన ది ఇన్ టచబుల్ సినిమాను తెలుగులో ఊపిరిగా రీమేక్ చేశారు. ఈ సినిమాను మొదట నాగార్జున.....

వదంతులపై మోహన్‌బాబు స్పందన

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబును నియమించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు రాయొద్దని కోరారు. 'టీటీడీ...

వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరారు. తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను అధికారిక కార్యకలాపాల కోసం...

నటుడి మృతిపై మోడీ సంతాపం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిన్యర్‌ కాంట్రాక్టర్‌(79) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 'చోరీ చోరీ చుప్కే చుప్కే', 'దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్‌', 'ఖిలాడీ', 'బాద్‌షా'...

పదిరోజుల్లోపు బెల్టుషాప్‌లు అన్ని తొలగించాలి

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్టు షాపులను పూర్తిగాతొలగించాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంతో ఎక్సైజ్ శాఖ కార్యాచరణకు సిద్ధమవుతోంది. బెల్టు షాపులు ఎక్కడున్నా పదిరోజుల్లోపు తొలగించాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ముఖేశ్‌ కుమార్‌ మీనా అధికారులను...

‘సూపర్‌ 30’ ట్రైలర్‌

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'సూపర్‌ 30'. బిహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్‌ కుమార్‌ స్థాపించిన 'సూపర్‌30' అనే ఐఐటీ శిక్షణ సంస్థ నేపథ్యంలో ఈ సినిమాను...

స్వరూపానంద ఆశీస్సులు అందుకున్న జగన్‌

ఏపీ సీఎం జగన్‌ విశాఖలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదా పీఠానికి చేరుకున్న జగన్‌కు పీఠం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు....

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేక దృష్టి.. పనులను పరిశీలించిన కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా రాంపూర్‌ చేరుకున్న ఆయన ఎస్సారెస్పీ పునరుజ్జీవన...

ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేస్తామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేసింది. గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ...

సమతుల్యం ఉండేలా తుది జాబితా: వై ఎస్‌ జగన్‌

ఈనెల 7న ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శాసనసభాపక్ష భేటీకి వైసీపీ...

పోసాని కృష్ణమురళీని పరామర్శించిన వైసీపీ నేతల

ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీఅనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళీ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....

తెలంగాణలో రెవెన్యూ రద్దు? కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాలం చెల్లిన భావనలతో మన వ్యవస్థలు ఇంకా కొనసాగుతున్నాయని, చేసే పని మారినా, పేరు మారని భావదారిద్ర్యంలో వ్యవస్థలు నడుస్తున్నాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. భూమి శిస్తు వసూలు చేసే కాలంలో రెవెన్యూ...

ఇఫ్తార్ విందులో స్వీట్లు తినిపించుకున్న జగన్, కేసీఆర్

హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు హజరయ్యారు. రాజ్ భవన్...

మద్యపానం నిషేధం పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్‌

రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక...

మురళీమోహన్‌ను పరామర్శించిన చిరంజీవి దంపతులు

ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు....

ఆ విషయంలో రాజీపడొద్దు: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే శాఖల వారీ సమీక్షకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని తన నివాసంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై తొలి సమీక్ష నిర్వహించారు....
error: Content is protected !!